Telugu health tips

Updated: 15-12-2023

రచయిత : E.Pavan Kumar ,and www.plus100years.com
 

నడవడం ఎందుకు అని మనలో  మనం అనుకున్నప్పుడు ...రోజు వారి పనులు చేసుకోవడం కోసం అనుకుంటాం ..మీరు అనుకునేది సబబే కానీ ఈ ఆధునిక  యుగం లో నడవడం అనేది తగ్గిపోయింది .. గత 40 సంవత్సరాల్లో నడవడం అనేది చాల తగ్గిపోయింది .. 
మన చిన్న తనం లో ఎన్నో అవసరాలకోసం నడిచే వెళ్లే వాళ్ళం .. మరి ఇప్పుడు 100 అడుగుల లోపు ఉన్న దూరం కోసం బండి తీయడం కార్ తీయడం చేస్తున్నాం .. 

అప్పుడు నడవడం అనేది ప్రాథమిక రవాణా సాధనం అందుకే అప్పుడు జీవన సరళికి సంబందించిన జబ్బులు ఇంతగా లేవు . 

ఇలా చేయడం వల్ల నడిచే సామర్త్యాన్ని కోల్పోతున్నాం కొద్దీ దూరం నడవగానే అలిసిపోతున్నాం .. 

ఎన్నో అధ్యయనాలు చెపుతున్న దాని ప్రకారం నడక అనేది మధుమేహహాన్ని రాకుండా చూస్తుంది మరియు నియంత్రిస్తుంది అని వైద్యులు కూడా ధ్రువీకరించారు . 

భారత దేశం లో 2023 నాటికి దాదాపు 8 నుండి 10 కోట్ల మంది కి మధుమేహం కలిగి ఉన్నారు అని గణాంకాలు  చెబుతున్నాయి 


వేగంగా నడవడం అంటే ఏమిటి ?
 

మనం ప్రతిదినం మన ఇంట్లో లేదా బయట నడిచే నడకలో తక్కువ వేగం ఉంటుంది ..అలానే వేగంగా నడిచే నడకలో ఎక్కువ వేగం ఉంటుంది మరియు తక్కువ సమయం లో ఎక్కువ దూరంగా వెళ్ళగలం

వేగంగా వేగంగా నడిచే పద్దతిని బ్రిస్క్ వాక్ అని కూడా అంటారు . వేగంగా రెండు చేతులను ఊపుతూ త్వర త్వరగా నడవడంవల్ల తక్కువ సమయం లో ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి మరియు శరీరం త్వరగా చమటలు పడుతుంది .. 

వేగంగా నడవడం అనేది అందరికి సాధ్యం కాకపోవచ్చు ఎందుకంటె మోకాళ్ళ నొప్పులు , శరీర అధిక  బరువు మరియు ఇతర  అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లకు ఇలా నడవడం కష్టం అలాంటప్పుడు మన శరీరానికి ఎలాంటి నడక సరిపడుతుండే అలానే నడవాలి .. 

వేగంగా నడవడాన్ని ఒక్కరోజులోనే అందుకోవడం సాధ్యంకాదు అలాంటప్పుడు మెల్లి మెల్లిగా నడక వేగాన్ని ప్రతిరోజు పెంచుతూ ప్రయత్నించాలి  ఇలా చేస్తే మనం అనుకున్న వేగాన్ని పొందగలం. 

ఉదాహరనకు :

మొదటి రోజు 10 నిమిషాలు 
రెండవ రోజు 15 నిమిషాలు 
మూడవ రోజు 20 నిమిషాలు 
నాల్గవ రోజు 25 నిమిషాలు 
ఐదవ రోజు 30 నిమిషాలు 

లేదంటే ప్రతి మూడు రోజులకు   5 నిమిషాలు పెంచుకునే ప్రయ్తత్నం చేయాలి .. 

అమెరికన్ హార్ట్ అసోసియేషన్  ప్రకారం ఒకవారం వ్యవధిలో కనీసం 150 నిమిషాలు ఏదయినా  వ్యాయామం కానీ నడక ఆయినా చేయాలి , ప్రతిరోజు 10,000 అడుగులు నడవాలి అని కూడా పరిశోధన సంస్థలు మరియు వైద్యులు  చెపుతున్నారు 
 

వేగంగా నడవడం మధుమేహులకు లాభమా ?

వేగంగా  నడవడం వల్ల మధుమేహు లకు చాల లాభాలు ఉన్నాయని పరిశోధనలు చెప్తున్నాయి 3 నుండి 4 కిలోమీటర్లు ఒక గంటలో నడవాలి అనేది ఒక పద్దతి ఇలా   నడవడం వల్ల రక్తం లో చక్కర స్థాయిలు నియంత్రించబడతాయి అనగా చక్కర స్థాయిలు తగ్గించబడతాయి . 

గుండె ఆరోగ్యం కోసం : వేగంగా నడవడం అన్నది మన గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది నడక ఒక మంచి సహజమయిన వ్యాయామం .దీని వల్ల గుండె లయ క్రమబద్ధంగా ఉంటుంది మరియు హృదయపు రక్తనాళాలు ఆరోగయంగా ఉంటాయి . 

అధికబరువు : మధుమేహానికి అధిక బరువు కూడా ఒక కారణమే ..అందుకే మధుమేహులు బరువుని నియంత్రణలో ఉంచుకోవాలి .నడక అనేది శరీర బరువు ను తగ్గించడం లో ముఖ్య పాత్ర పోషిస్తుంది .నడవడం వల్ల శరీర బరువు అదుపులో ఉంటుంది మరియు మధుమేహం ముప్పుకూడా తగ్గుతుంది 

ఈ రెండు రకాల టీ లు మధుమేహులకు ఉపయోగం https://www.plus100years.com/health-tips/health-benefits-of-tea
 

సంపూర్ణ  ఆరోగ్యం కోసం : నడక అనేది ఒక మధుమేహం కోసంమే  కాదు ఇది ఒక సంపూర్ణయమయిన ఆరోగ్యం కోసం మనం తప్పకుండ ఆచరించాల్సిన అలవాటు .. 
మీరు గనక ఏదయినా అనారోగ్యం తో  బాధపడుతున్నట్లయితే మీ వైద్యుని  సలహా తీసుకుని నడక ను మొదలు పెట్టండి .

 

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home