లలిత దేవి ఎవరు
లలితా దేవిని శివుని సహచరిగా పరిగణిస్తారు మరియు శంకరుని మూడవ కన్ను యొక్క శక్తి ని లలిత దేవి గా పరిగణిస్తారు . లలిత దేవి కి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని షోడశి తంత్రం నుండి అర్థం చేసుకోవచ్చు.
లలితా సహస్రనామాన్ని ఎనిమిది మంది వాగ్ దేవిలు (వాసిని, కామేశ్వరి, అరుణ, విమల, జయని, మోదిని, సర్వేశ్వరి మరియు కౌలిని) స్వయంగా లలితా దేవి ఆజ్ఞపై రచించారని చెబుతారు.
లలిత సహస్రనామం అనేది లలిత దేవత ను స్తుతించే సంస్కృత స్తోత్రం లేదా శ్లోకం. ఇది లలిత దేవి యొక్క 1000 పేర్లతో కూడి ఉంది, వీటిలో ప్రతి ఒక్కటి ఆమె దివ్య స్వభావం యొక్క విభిన్న కోణాన్ని వివరిస్తుంది. స్తోత్రం 34 అధ్యాయాలుగా విభజించబడింది, వీటిలో ప్రతి ఒక్కటి 29 లేదా 30 పేర్లను కలిగి ఉంటుంది.
ధ్యానం
" సింధూరారుణ విగ్రహాం త్రినయనామ్ మాణిక్య మౌలి స్పురాత్
త్తారా నాయక శేఖరాం స్మితముఖీ మాపిన వక్షోరుహాం ,
పాణిభ్యామ్ మని పూర్ణ రత్న చషకం రక్తోత్పలం విభ్రతీమ్,
సౌమ్యాం రత్న ఘటస్థ రక్త చరణాం , ధ్యాయేత్ పరాదంబికామ్ "
అర్థం
" ఆ అంబికను ధ్యానించు,
కుంకుమపువ్వు రంగులో ఉన్న శరీరం ఎవరికి ఉంటుంది,
మూడు మనోహరమైన కళ్ళు ఎవరికి ఉన్నాయి,
రత్న కిరీటం ఎవరికి ఉంది,
చంద్రునిచే అలంకరించబడిన,
ఎవరు ఎల్లప్పుడూ ఆకర్షణీయమైన చిరునవ్వుతో ఉంటారు,
ఎవరు ఎత్తైన మరియు దృఢమైన రొమ్ములను కలిగి ఉంటారు,
విలువైన రాళ్లతో చేసిన ద్రాక్షరసం నిండిన కప్పు ఎవరి వద్ద ఉంది,
మరియు ఆమె చేతుల్లో ఎర్రటి పువ్వులు,
ఎప్పటికీ శాంతి సముద్రం ఎవరు,
మరియు ఆమె ఎర్రటి పవిత్ర పాదాలను ఎవరు ఉంచుతారు.
ఆభరణాల వేదికపై. "
లలితా సహస్రనామం యొక్క అద్భుతమైన ప్రయోజనాలు బ్రహ్మాండ పురాణంలో చక్కగా చెప్పబడ్డాయి.
మనం ఒక పద్ధతి ప్రకారం లలిత సహస్రనామాన్ని చదివినట్లయితే పూర్వ జన్మలలో చేసిన పాపకర్మల ప్రభావం ఈ జన్న్మలో నశించబడుతాయి
తంత్రం లేదా మంత్రం యొక్క మరొక రూపంతో పోలిస్తే ఇది అత్యంత శక్తివంతమైన మంత్రంగా పరిగణించబడుతుంది.
హయగ్రీవ భగవానుడు కూడా లలిత సహస్రనామ స్తోత్రాన్ని పూర్తి అంకితభావంతో సాధన చేసి ముక్తిని పొందాడు.
లలిత సహస్రనామం వల్ల ఉపయోగాలు :
- దసరా నవరాత్రులలో లలిత సహస్రనామ పారాయణం శుభ ఫలితాన్ని ఇస్తుంది
- లలిత దేవి ని 3 రకాలుగా కొలవవచ్చు 1. పారాయణం (అంటే లలిత సహస్రనామాలను చదవడం), 2 . అర్చన (కుంకుమార్చన లేదా పుష్పార్చన ) , 3. హోమం ద్వారా అమ్మ వారిని కొలవవచ్చు
- పౌర్ణమి రోజున లలితా సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే, మనలోని అన్ని రోగాలు నశించి, దీర్ఘాయువు కలిగి ఉంటుందని నమ్ముతారు.
- ఒక్కసారి స్తోత్రం పఠిస్తే సకల శుభాలు కలుగుతాయి. అలాగే కోటి గంగా స్నానాలు చేసిన ఫలితం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది.
- మీకు ఏదయినా ఆపద వచ్చినప్పుడు లలిత సహస్రనామాన్ని 40 రోజులు పఠిస్తే మీకు ఫలితం కనపడుతుంది.
- లలిత సహస్రనామాన్ని చదవడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.
- లలిత సహస్రనామాన్ని చదవడం వల్ల మీలో ఒకరకమయిన అనుకూల శక్తి ఉత్పన్నమవుతుంది.
- నిరంతరమయిన లలితా సహస్రనామ పఠనం వల్ల కుండలిని శక్తి జాగృతమవుతుంది అమ్మ వారు శక్తి స్వరూపిణి.
- లలిత సహస్రనామాన్ని 6 నెలలు క్రమం తప్పకుండ పఠిస్తే మీ ఇంట్లో లలిత దేవి స్థిరనివాసం చేస్తుంది.
- లలిత సహస్రనామాన్ని ఎవరయినా చదువ వచ్చు ,కానీ అక్షర దోషం లేకుండా చదివే ప్రయత్నం చేయాలి .
- దీన్నీ వడివడిగా చదవడం లేదా ఎక్కువ సమయం తీసుకుని చదవడం చేయరాదు ..ఒక నిర్ణీత సమయం అనగా 30 నిమిషాల నుండి 60 నిమిషాల వరకు చదువవచ్చు .
- ఉదయం వేళలో అయినా లేదా సాయంత్రం సమయం లో అయినా చదవడం ఉత్తమం , చదివే ముందు స్నానం చేసి శుభ్రమయిన స్థలములో చదవాలి .
- చదివే ముందు వీలయితే దీపాన్ని వెలిగించి నమస్కారం చేసుకుని చదవాలి.
- మీరు ఎందుకోసం చదువుతున్నారు అని మనసులో సంకల్పం చేసుకుని చదవాలి .
- నుదుట కుంకుమ , లేదా విభూతి అయినా పెట్టుకోవాలి.
- కొందరు ప్రతి మంగళవారం మరియు శుక్రవారం చదువుతారు ఇలా చదవడం కూడా ఉత్తమమే .
ఈ రోజులలో గుడిలో కానీ లేదంటే అందరు కలిసి పారాయణం కూడా చేస్తున్నారు , ఎలా చదివినా లోపం లేకుండా లలిత దేవి మీద భక్తి ని ఉంచి చదవాలి .
ఓం శ్రీ మాత్రే నమః
రచయిత :ఇ .పవన్ కుమార్ శర్మ మరియు www.plus100years.com సభ్యులు
ఈ రచన యొక్క మీ అమూల్యమయిన అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియచేయండి లేదా వాట్సాప్ చేయండి : 9398601060
Comments
(No subject)
In reply to (No subject) by Anonymous (not verified)
(No subject)
(No subject)
(No subject)
Add new comment