లైంగికపరమైన విషయాల గురించి చర్చించాల్సిన సందర్భాలు వస్తే సిగ్గుతో కుచించుకుపోయేవారు ఎక్కువ. కానీ ఇప్పుడు మనం దీని గురించి చర్చించుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే శృంగారం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పైగా మీ ఆయుష్షును కూడా పెంచుతుంది. ఏంటీ శృంగారం లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందా? అని ఆశ్చర్యపోతున్నారా? అయితే మీరు కచ్చితంగా ఇది చదవాల్సిందే.
అవును.. మీరు చదువుతున్నది నిజమే. కానీ శృంగారానికి, జీవితకాలానికి సంబంధం ఏంటి? కచ్చితంగా ఉంది. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఆరోగ్యంగా ఉండటం ఎంత అవసరమో.. లైంగికంగా ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే అవసరం. లైంగిక జీవితం సక్రమంగా లేకపోతే.. దాని ప్రభావం ఇతర విషయాలపైన కూడా పడుతుంది.
శృంగార జీవితం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే భాగస్వాములిద్దరి మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది.
అంటే భాగస్వామితో ఆనందకరమైన జీవితం గడుపుతారు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి అవలంబిస్తారు. ఫలితం జీవితకాలం పెరుగుతుంది. వయసుతో పాటు శృంగారాన్ని ఆస్వాదించే విషయంలో కొన్ని మార్పులు రావచ్చు. కానీ లైంగిక చర్యలో పాల్గొనడం వల్ల వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం మారవు.
ప్రస్తుత తరంలో ఎక్కువ మంది జీవన సరళి వ్యాధులు అంటే , అధిక రక్తపోటు ,మధుమేహం , క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. కానీ వారానికి కనీసం రెండుసార్లు శృంగారంలో పాల్గొనే వారిలో ఈ తరహా వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఒక అధ్యయనం ప్రకారం వారంలో కనీసం రెండు సార్లు శృంగారం లో పాల్గొనే పురుషుల్లో 50 శాతం మేర కరోనరీ హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశం తగ్గుతుంది. తమ భాగస్వామితో గాఢమైన బంధం అల్లుకున్నవారిలో మాత్రమే ఈ విషయాన్ని గుర్తించారు. అదే మహిళల విషయానికి వచ్చేసరికి ఎక్కువసార్లు భావప్రాప్తికి లోనయ్యేవారు.. మిగిలిన వారితో పోలిస్తే.. ఎక్కువ కాలం జీవిస్తారని మరో అధ్యయనంలో తేలింది. వారంలో కనీసం ఐదు సార్లు లైంగిక చర్యలో పాల్గొనే పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్, స్త్రీలల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్టు కొన్న అధ్యయనాల్లో తేలింది.
శరీరం లో ఏమి జరుగుతుంది ....
శృంగారంలో పాల్గొనే సమయంలో శరీరంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడికి కారణమైన కార్టిసోల్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. అలాగే నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. సాధారణంగా లైంగిక చర్య తర్వాత త్వరగా నిద్ర రావడానికి కారణం అలసిపోవడం అనుకుంటారు. కానీ ఆక్సిటోసిన్ త్వరగా నిద్రపట్టేలా చేస్తుంది. ఆక్సిటోసిన్ ఒత్తిడిని తగ్గిస్తుంది. అంటే... జీవితం ఆనందమయంగా సాగుతుంది. ఈ ఆక్సిటోసిన్ పెయిన్ కిల్లర్ గా కూడా పనిచేస్తుంది.
వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే వారితో పోలిస్తే రెండు, అంతకంటే ఎక్కువసార్లు పాల్గొనే వారికి ‘ఇమ్యునోగ్లోబ్యులిన్ ఎ’ అనే యాంటీబాడీలు శరీరంలో పెరుగుతాయి. ‘ఇమ్యునోగ్లోబిన్ ఎ’ ఏం చేస్తుంది? శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ లాంటివి రాకుండా నిరోధిస్తుంది.
సెక్స్ లో పాల్గొన్న సమయంలో శరీరంలో విడుదలయ్యే ఒక హార్మోన్ మన ఆరోగ్యానికి, అందానికి కూడా మేలు చేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వారానికి రెండు సార్లు లైంగిక చర్య లో పాల్గొనడం వల్ల ఇన్ని ఆరోగ్యపరమైన ప్రయోజనాలు వస్తుంటే.. కచ్చితంగా ఆయుష్షు పెరుగుతుంది కదా..!
ఈ ఆర్టికల్ ఆరోగ్యానికి సంబందించిన సమాచారం కోసం మాత్రమే ప్రచురించబడింది, మీ ఆరోగ్య సమస్యలకు మీ యొక్క వైద్యుని సలహాలు తీసుకోండి
Add new comment