Image


పుచ్చకాయ తినడం వల్ల కలిగే 14 అద్భుతమయిన ఆరోగ్య ప్రయోజనాలు 

Watermelon Health Benefits In Telugu

ఎండాకాలంలో మనం వడ దెబ్బకు గురి కాకుండా ఉండేందుకు ఎక్కువగా నీటిని తాగుతుంటాం,ఇంకా పుచ్చకాయ ను కూడా తింటూ ఉంటాం ...

పుచ్చకాయ లో 94 % నీరు మిగతావి పోషకాలు ఉంటాయి. పుచ్చకాయ  ఎండాకాలం లో ఎక్కువగా అందుబాటు లో ఉండే పండు , దీనిని తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం ...

పుచ్చకాయ లో ఏముంటాయో ఎందుకు తినాలో తెలుసుకుందాం.

  1. దాదాపు ఒక కప్పు పుచ్చకాయ ముక్కలని తింటే మనకు 34 కేలరీలు అందుతాయి మరియు 0 % కొవ్వు ఉంటుంది
  2. మన శరీరం ఆర్ద్రీకరణం కు గురియైనపుడు శరీరం నుండి మలినాలు బయటికి వెళ్లిపోవు ..అలాంటప్పుడు పుచ్చకాయ తినడం వల్ల ఆర్ద్రీకరణం నుండి తప్పించుకోవచ్చు..
  3. వేసవి కాలంలో మన శరీరం ఆర్ద్రీకరణం కాకుండా కాపాడే పండ్లలో పుచ్చకాయ మొదటి స్తానం లో ఉంటుంది ..
  4. దీనిలో ఉండే అధిక పీచు మరియు నీటి వల్ల మన జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది
  5. అధికరక్తపోటు ఉన్న వాళ్ళు  పుచ్చకాయను తింటే అధికరక్తపోటు  ను అదుపులో ఉంచుకోవచ్చు
  6. హృదయానికి రక్తాన్ని చేరవేసే రక్తనాళాల్లో కొవ్వు ఏర్పడకుండా కాపాడుతుంది
  7. విటమిన్ ఏ మరియు విటమిన్ సి తక్కువ గా ఉంటె మన చర్మం ఎండి పోయినట్టు గా నిర్జీవంగా తయారవుతుంది ..సహజంగా ఇవి మన  చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే   పుచ్చకాయని మీ ఆహారం లో చేర్చుకోవలసిందే , ఎందుకంటే దీనిలో విటమిన్ ఏ మరియు విటమిన్ సి పుష్కలంగా  ఉంటాయి .
  8. పుచ్చకాయ ను  విత్తనాల తో సహా తినండి వాటిని తీసివేసి తినకండి ఎందుకంటె వీటిలో ఉండే కాపర్ , జింక్ , పొటాషియం ,  మెగ్నీషియం, ఐరన్ , ఫోలేట్  మొద .. మన శరీరానికి కావాల్సిన సూక్ష్మపోషకాల ను అందిస్తాయి ...  ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ  తెలుసుకోండి 
  9. పుచ్చకాయ ను  విత్తనాలలో ఉండే ఒమేగా 3 మరియు ఒమేగా 6 పదార్థాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి , గుండె పోటు రాకుండా కాపాడుతాయి , చర్మం ఆరోగ్యంగా ఉంటుంది .
  10. పుచ్చకాయ విత్తనాలు తినటం  వల్ల వెంట్రుకలు రాలిపోవడాన్ని అరికట్టవచ్చు
  11. పుచ్చకాయ తినడం వల్ల రోగ నిరోధకశక్తి  మెరుగవుతుంది
  12. ఎముకలు బోలుగా అవడం అనేది నిరోధించబడుతుంది
  13. అధికబరువు అనేది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది  , పుచ్చకాయ తినడం వల్ల శరీరానికి అన్ని రకాల పోషకాలు అందుతాయి మరియు దీనిలో కొవ్వు అసలే ఉండదు .ఇది శరీర బరువును అదుపులో ఉంచుతుంది 
  14. పుచ్చకాయ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు కూడా తినవచ్చు , కానీ అధికంగా తినరాదు 

ఆహార నిపుణుల సూచనల ప్రకారం పుచ్చకాయను మధ్యాహ్నం లేదా వేసవికాలంలో సాయంత్రం  తినడం వల్ల శరీరం అలసిపోకుండా ఉంటుంది

దీన్ని పండ్ల ముక్కలుగా కానీ , పండ్ల రసం గా అయినా తీసుకోవచ్చు 

 

పుచ్చకాయ రసం ఎలా తయారుచేసుకోవాలి ?

పుచ్చకాయ 75 % , దోసకాయలు 25 % కలిపి గ్రైండ్ చేయాలి , దాంట్లో కొన్ని పుదీనా ఆకులు వేసుకోవాలి ..ఇలా తయారు చేసిన రసాన్ని మీరు మరియు మీ తిథులకు ఆరోగ్యకరమయిన పానీయంగా ఈ వేసవిలో అందించండి


ఇంకా ఎన్నో విలువయిన  ఆరోగ్య సూత్రాలను  ఇక్కడ పొందండి 

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home