Image

 

ప్రతి వ్యక్తి తాను ఆరోగ్యంగా ఉండాలనే కోరుకుంటాడు , మరి ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది .మన ఆరోగ్యం గురించి కొన్ని సార్లు తెలిసో తెలియకనో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం అందుకే ఇక్కడ మనం కొన్ని అతి ముఖ్యమయిన  ఆరోగ్య సూత్రాలను తెలుసుకుందాం .....

Health Tips in Telugu 

1.నిద్ర ఎంత సేపు పోవాలి ?

వయస్సు ప్రకారం
4 నుండి 12 నెలల వయస్సు -- 12 నుండి 16 గం
1 నుండి 2 సం // వయస్సు  -- 11 నుండి 14 గం
3 నుండి 5 సం // వయస్సు - 10 గం // 13 గం
6 నుండి 12 సం // వయస్సు -9 గం // 12 గం
13  నుండి 18 సం // వయస్సు - 8 గం // 10 గం
18 నుండి ఆ పై వయస్సు వాళ్ళు కనీసం 8 గం నిద్ర పోవాలి

వయస్సు ఎక్కువయ్యే కొద్దీ నిద్ర పోయే సమయం తగ్గుతుంది కానీ ప్రతి వ్యక్తి కి సరయిన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారు .

 

2.ఎలాంటి ఆహారం తినాలి?

మనిషి జీవించడానికి ఆహారం అవసరం . ఆహారం తీసుకోవడానికి మనకు కొన్ని ప్రాచీన మరియు ఆధునిక పద్ధతులు నియమాలు ఉన్నాయి ....

  • ఆహారం తేలికగా జీర్ణమయ్యేది అయి ఉండాలి
  • ఋతువుల ప్రకారం ఆహారాన్ని తీసుకోవాలి
  • విరుద్ధ ఆహారాన్ని అసలే తినరాదు
  • ఆహారం పరిశుభ్రమయినదయి ఉండాలి
  • ప్రకృతి సహజంగా పండించిన ఆహారాన్నే తినాలి
  • కాయగూరలు , ఆకుకూరలు , పండ్లను  మంచి నీటిలో కడిగిన తరవాతనే తినాలి
  • వీలయితే ఉప్పు వేసి కడిగితే దాని మీద ఉన్న కొన్ని ఫంగస్ , బ్యాక్టీరియా , పురుగు మందుల అవశేషాలు కొంత వరకయినా వెళ్లి పోతాయి ....
  • ఎక్కువ కాలం  నిలువ ఉంచిన ఆహారాన్ని తినరాదు, ప్రతి పదార్థానికి జీవిత కాలం అనేది ఉంటుంది.
  • చెడు వాసన వచ్చే ఆహారాన్ని అసలే తినరాదు
  • ఎక్కువగా పీచు పదార్థాలు ఉన్న ఆహారాన్ని తినాలి ,బీర , తృణ ధాన్యాలు , మొలకెత్తిన విత్తనాలు , పండ్లు , ఆకు కూరలు , చిలగడదుంప ....
  • ఆహారాన్ని ఎప్పుడు కూడా మన ఆరోగ్య సమస్యల ప్రకారమే తినాలి ...ఉదా :

మధుమేహం ఉన్నవాళ్లు పంచదార కలిగిన పదార్థాలను తినకపోవడం

గుండె సమస్యలు ఉన్నవాళ్లు బాదాం లాంటి పదార్థాలు తినడం వంటివి చేయాలి ....

  • తినే టప్పుడు తగినంత సమయం తీసుకుని తినాలి , నెమ్మదిగా తినాలి ఆహారాన్ని బాగా నమిలి తినాలి .
  • ప్రాచీన ఆరోగ్య సూత్రాల ప్రకారం ఆహారం తినే టప్పుడు మాట్లాడరాదు ,మాట్లాడినా కూడా అతి తక్కువగా మాట్లాడాలి.
  • ఆహారం తినే టప్పుడు మంచి భావనతో తినాలి అయితే నే మనము తిన్నది శరీరానికి మేలు చేస్తుంది ..
  • తినే స్థలము పరిశుభ్రంగా  ఉండాలి , స్థిరాసనం లో ఉండి తినాలి ...


ఆహారం తినే టప్పుడు అతి ఎక్కువగా నీటిని  త్రాగరాదు ....అవసరం మేర కు కొంత త్రాగి తిన్న తరవాత కొంత సేపటికి 15 నిమిషాల నుండి 30 నిమిషాల తరవాత తగినంత నీటిని త్రాగితే తేలికగా జీర్ణం అవుతుంది .మన లో ఉన్న జఠరాగ్ని ఆహారాన్ని జీర్ణింప చేస్తుంది .

  • ఆహారం ప్రాంతాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది చల్లని ప్రదేశాలలో అనగా హిమాలయ పర్వత ప్రాంతాల వాళ్ళు ఆవ నూనె ను ఆహారం గా వాడతారు దానికి కారణం అక్కడి అతి చల్లని శీతోష్ణ స్థితి ...ఆవ నూనె శరీరానికి వేడిని ఇస్తుంది ...
  • ఆహారం తగినంత పోషకాలు కలిగినదయి ఉండాలి . ఎప్పుడు ఒకే రకమయిన పదార్థాలు తినరాదు ...


3.వ్యాయామం 

మొట్టమొదటగా వ్యాయామం ఎందుకు అనేది చూద్దాం , క్రమం తప్పని శారీరక శ్రమ మన యొక్క శరీర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది , శారీరిక అంగాలు బలంగా తయారవుతాయి ,మొత్తంగా శరీర సామర్థ్యం పెరుగుతుంది ...శరీరానికి తగినంత ప్రాణ వాయువు ( ఆక్సిజన్ అందుతుంది )దీని వల్ల చురుకుగా ఆరోగ్యంగా ఉంటారు ...

వ్యాయామం ఎవరికి?

రాను రాను ఎన్నో కారణాలవల్ల మనిషి బద్దకస్తుడిగా తయారవుతున్నారు మన పూర్వికులు అనగా ఇప్పటి నుండి ఒక 40 సం // లకు ఇంకా పూర్వం మన వాళ్ళు అన్ని పనులకు నడిచి వెళ్లే వాళ్ళు ...నడిచి వెళ్లి 10 కిమీ వరకు ఉన్న పాఠశాలలలో చదువుకునే వారు ఒక ఊరి నుండి ఇంకో ఊరికి నడిచి కానీ , సైకిల్ ఉంటె దానిని లేదా ఎడ్ల బండిని వాడే వారు ..అంటే నడక  & శారీరక శ్రమ అనేవి వాల్ల జీవితం లో ఒక భాగం ..వారికి  వీటివల్ల తగినంత విటమిన్ డి లభ్యమయ్యేది ...ఇప్పుడు పరిశోధనలు చెప్తున్న దాని ప్రకారం విటమిన్ డి తగినంతగా ఉంటె కరోనా వల్ల సంభవించే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది ...

వారు రామా రమి ఒక దినం లో ఎన్నో వేల  అడుగులు అవలీలగా నడిచేవారు ,కానీ ఇప్పుడు మనం చేతికి ఆధునిక స్మార్ట్ వాచీలు పెట్టుకుని 100000 (పది వేల అడుగులు పండుగ చేసుకుంటున్నాం ) ....

అప్పుడు ఊబకాయం అనేది దాదాపు లేనే లేదు , మధుమేహపు ఛాయలు లేవు , అధిక రక్తపోటు అంటే తెలియదు ఇంకా ఎన్నో ఆధునిక వ్యాధులు లేవు .....

ఎవరయితే శారీరక మయిన శ్రమ చేయరో వారికి వ్యాయామం అవసరం  నడక , బట్టలు ఉతకడం ఇంకా ఎన్నో పనులు మనకు సహజ మయిన వ్యాయామం లాంటివే ....

                                                                         " బద్దకస్తుడికి వ్యాయామం కూడా అక్కరకు రాదు "

ఇప్పటి పరిస్థితులను బట్టి ఒక వ్యక్తి రోజులో కనీసం 10,0000 అడుగులు లేదా 3 - 4 కిమీ ప్రతి రోజు నడవాలి , లేదా ఏదయినా వ్యాయామం 30 నిమి.. లేదా 40 నిమి.. చేయాలి ....దీనివల్ల ఆరోగ్యం మరియు  దీర్ఘాయుష్షు .


ఇతర ముఖ్య ఆరోగ్య సూత్రాలు :

4.ప్రతి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని 3 లేదా 4 గ్లాసులు త్రాగాలి -దీనివల్ల విరేచనమ్ సాఫీగా అయ్యి మలినాలు వెళ్లి పోతాయి ...
5.కాలకృత్యాలని బలవంతంగా ఆపుకోరాదు
6.తగినంత శుభ్రమయిన నీటిని త్రాగాలి
7.ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతతో బాటు ఎన్నో వ్యాధులు నయమవుతాయని పరిశోధనలు నిరూపించాయి 
8.ఇష్టమయిన పని చేయడం వల్ల మానసిక ఉల్లాసం లభిస్తుంది
9.ఇష్టమయిన పుస్తకాలు చదవడం
10.ఇష్టమయిన సంగీతాన్ని వినడం
11.కుటుంబ సభ్యులతో గడపడం
12.అన్ని వేళల మానసికంగా బలంగా ఉండటం
13.తక్కువగా యంత్రాల మీద ఆధారపడటం
14.అవసరమయినపుడు వైద్యున్ని సంప్రదించడం
15.శరీర బరువును తగినంతగా ఉండేటట్టు చూసుకోవడం
16.వయస్సు ప్రకారం అలవాట్లు మార్చుకోవడం
17. ప్రతి 15 రోజులకు ఒక సారి అయినా ఉపవాసం ఉండటం వల్ల శరీర బరువు తగ్గడమే కాకుండా కొన్ని వ్యాధులు రాకుండా ఉండటానికి తగిన శక్తి మరియు ఉత్సాహం మన శరీరానికి వస్తుంది

18.అవసరాన్ని బట్టి గ్రీన్ టీ కానీ ఏదయినా హెర్బల్ టీ ని కానీ త్రాగండి

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆరోగ్య సూత్రాలు :

ఆయుర్వేదం ప్రకారం రుతువులలో వచ్చే ఆహారాన్ని తీసుకోవాలి మరియు ఆయుర్వేదం లో చెప్పినట్టు మనిషి తన యొక్క శరీర  తత్వాన్ని బట్టి ఆహారాన్ని తీసుకోవాలి అవి వాత , పిత్త , కఫ .

19.నీటిని కూచొని మాత్రమే తాగాలి

20.కొన్ని సార్లు మనకు జీర్ణం కానపుడు ఈ  చిట్కా ని పాటించండి ఒక చెంచా తురిమిన అల్లం కు నిమ్మకాయ చుక్కలు మరియు కొంత ఉప్పు కలిపి త్రాగండి దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది .

21.ఆహారాన్ని తగినంతనే తినాలి అతి ఎక్కువ అతి తక్కువ రెండు అనర్థమే

22.రోజుకు రెండు సార్లు మాత్రమే తినాలి ప్రొద్దున మల్లి రాత్రి ప్రారంభ కాలంలో

23.ప్రతి భోజనానికి మధ్య 4 నుండి 6 గం సమయం ఉండాలి

24.రాత్రి 7 గం ల లోపు తినాలి

తొందరగా పడుకోవాలి మల్లి సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి

ప్రొద్దున ఆహారం :

1 / 2  భాగం ఘన ఆహారం తో

1 / 4   భాగం  ద్రవ పదార్థం తో

1 / 4  భాగం  కాలి కడుపుతో ఉంచాలి

రాత్రి సమయం లో :

1 / 4  భాగం ఘన ఆహారం తో

1 / 2   భాగం  ద్రవ పదార్థం తో

1 / 4  భాగం  కాలి కడుపుతో ఉంచాలి

 

ఇక్కడ చర్చించుకున్న (health tips in telugu)  ఆరోగ్య సూత్రాలు మనల్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుతాయి ....ఇంకా ఎన్నో మన పరిస్థితులను  బట్టి అలవాటుచేసుకుంటూ పొతే ఆరోగ్యం ఆనందం మనకే సొంతం

మీరు పాటించే ఆరోగ్య కరమయిన పద్దతులను ఇక్కడ రాయండి 

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home