ప్రొద్దున లేసింది మొదలు మన దినచర్య తేనీరు సేవించడం తోనే ప్రారంభం అవుతుంది ..
టీ అనేది మన జీవితం లో ఒక భాగమయి పోయింది , ఇంటికి వచ్చిన అతిథికి ముందుగా ఇచ్చేది టీ నే , పిచ్చాపాటిగా మాట్లాడుకోవాలన్న టీ ఉండాల్సిందే , పని భారం ఎక్కువయినా టీ నే దిక్కు .
మరి ఈ టీ ని మన ఆరోగ్యం కోసం ఎన్ని రకాలుగా తయారు చేసుకోవచ్చో చూద్దాం ,
అల్లం టీ :
మన అందరికి చాల నచ్చే టీ ఇది , అల్లం తురిమి టీ లో మరిగించి తయారుచేసేది .
అల్లం ను ఔషధంగా వాడటం ఎప్పటినుంచో ఉంది , అల్లం మధుమేహం రాకుండా కాపాడుతుంది ,ఇన్సులిన్ మోతాదును సరిగ్గా ఉంచుతుంది , సహజమయిన నొప్పి నివారిణి అల్లం ,కాన్సర్ రాకుండా కాపాడుతుంది , మీ జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది , కడుపు ఉబ్బరం లాంటివి పోగొడుతుంది , హృదయాన్ని కాపాడుతుంది , రక్త ప్రసరనను మెరుగుపరుస్తుంది , మోకాళ్ళ నొప్పులను పోగొడుతుంది .
అందుకే టీ ని అల్లం తో చేసుకోండి
దాల్చినచెక్క టీ :
దాల్చినచెక్క ఒక రకమయిన సుగంధ ద్రవ్యం పూర్వ కాలం నుండి దాల్చిన చెక్కను ఎన్నో రకాలుగా ఉపయోగిస్తున్నారు .
ఆయుర్వేదం ప్రకారం దాల్చినచెక్క వాత దోషాలను తొలగిస్తుంది.
దాల్చినచెక్క మధుమేహాన్ని రాకుండా చూస్తుంది మరియు అదుపులో ఉంచుతుంది .
ఇది అధిక రక్త పోటు ఉన్న వాళ్లకి ఉపయోగం
మనం రోజు చేసుకునే టీ లో దాల్చిన చెక్క పొడి వేసి మరిగించి తాగాలి
ఈ దాల్చిన చెక్క టీ వల్ల పయిన తెలిపిన ఆరోగ్య సమస్యలు అదుపులో ఉంటాయి
ప్రతి రోజు ఎక్కువసార్లు ఈ టీ ని తాగరాదు .
Add new comment