Image

 

కరోనా వైరస్ వల్ల   భారత దేశం  మరియు ప్రపంచం మొత్తం మీద కొన్ని లక్షల మంది చనిపోయారు మరియు దాని బారినపడి కొన్ని కోట్ల మంది కోలుకున్నారు మరియు  కోలుకుంటున్నారు .....

కోలుకున్న తరువాత కూడా చాల మంది లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి  .అందుకే ఆరొగ్య సమస్యలు మన దీర్ఘకాలిక ఆరోగ్యంమీదప్రభావం  చూపెట్టకుండా  ఉండటానికి తీసుకోవాల్సిన  జాగ్రత్తలు చూద్దాం.

ఒక సారి కరోనా  వచ్చి  తగ్గిన తరువాత మూత్రపిండాలు, ఊపిరితిత్తులు , గుండె , బ్లాక్ ఫంగస్ మరియు ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టె అవకాశముంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం కరోనా వచ్చి 17 రోజుల నుండి కొందరు వారి ఆరోగ్య పరిస్థిని బట్టి నెల రోజులు ఇంకా ఎక్కువ సమయం  కోలుకోవడానికి పట్టవచ్చు .శ్వాస  తీసుకోవడం  లో  ఇబ్బందులు , మళ్ళి జ్వరం రావడం .అలసట , కీళ్ల నొప్పులు , గుండె పోటు ఇలా కొన్ని రకాల సమస్యలు వేధించే అవకాశం ఉంది.

తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మళ్ళి మాములు స్థితికి రావడానికి  ఈ సూచనలు సహాయపడతాయి :

 

ముఖ్యమయిన సూచనలు ..


1. తగినంతగ ద్రవపదార్థాలు త్రాగాలి , మంచి నీళ్లు తగినంత త్రాగాలి ..
కిడ్నీ సమస్యలు ఉంటె వైద్యుని సలహా ప్రకారం త్రాగాలి .. పాలు , పండ్ల రసాలు భోజనం తరవాత తీసుకోవడం ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశం ఉంది
2 . శ్వాస కు  సంబందించిన వ్యాయామాలు , ధ్యానం చేయడం వల్ల ఒత్తిడి పోయి మెదడుకు ,గుండెకు మరియు ఊపిరితిత్తులకు తగినంత ప్రాణవాయువు చేరే అవకాశం ఉంటుంది 
3 .కరోనా నుండి కోలుకున్న తరువాత ప్రతి నిత్యం కనీసం 6 గం అయినా నిద్ర పోవాలి ...తగినంత నిద్ర చాల అవసరం.నిద్ర వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది ...ఒక వేళ మీకు నిద్ర రాకుంటే ..రాత్రి పడుకునే ముందు  పాలల్లో జాజికాయ వేసి మరిగించి త్రాగాలి ..దీనివల్ల నిద్ర బాగా పడుతుంది .
4 . తగినంత విశ్రాంతి తీసుకోండి 
5 . పొగ త్రాగే అలవాటు ఉంటె తప్పకుండ మానెయ్యాలి 

6 . ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది ...లివర్ సమస్యలు ఉంటె అసలే మద్యపానం త్రాగకండి 
7 . వాక్సిన్ తీసుకోకుంటే వైద్యుని సలహా ప్రకారం తీసుకోండి , మొదటి డోసు లేదా రెండవ డోసు గురించి వైద్యనిపుణుల సలహా తీసుకోండి 

8 . కోలుకున్నాక  మొదటి వారం తరువాత నుండి తప్పకుండ నడక , వేగంగా నడవడం లాంటివి మీ యొక్క ఆరోగ్యస్థితిని బట్టి చేయండి ...కఠిన మయిన వ్యాయామాలు చేయకండి ... కరోనా తో బాధపడే సమయం లో కూడా నడవడం లాంటివి చేయడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంది కానీ కొందరికి బలహీనం గా ఉండటం  తో సాధ్యం కాకపోవచ్చు ....

9 . కరోనా  తో కోలుకున్న తరువాత ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం లో ప్రోటీన్స్ 3  పూటలా ఉండేటట్టు చూసుకోవాలి దాదాపు 75 గ్రాముల ప్రోటీన్స్ ఒక రోజులో తీసుకోవాలి ...

10 . ప్రతిరోజు దాదాపు 200 గ్రాముల నుండి 300 గ్రాముల కాయగూరలు తినడం వల్ల మనకు అందాల్సిన పోషకాలు అంది త్వరగా  కోలుకునే అవకాశం ఉంటుంది ..

ఇది కూడా చదవండి  : ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఎలా ఉండాలో ఇక్కడ తెలుసుకోండి 

11 . విటమిన్ సి కోసం , నిమ్మ కాయ నీరు త్రాగడం , కమల పళ్ళు తినడం , ఉసిరి ని ఆహారం లో తీసుకోవడం వల్ల తగినంత విటమిన్ సి అందుతుంది ..
12 . ప్రతి రోజు 5 బాదాం పలుకులు తినడం వల్ల జింక్ అందుతుంది 
13 . ఎండలో ఒక 30 నిముషాలు ఇంకా ఎక్కువసేపు గడపటం వల్ల విటమిన్ డి అందుతుంది , ఉదయం  11  గంటల లోపు ఎండలో గడపడం ఉత్తమం.
14 . గోరు వెచ్చని నీటిని మాత్రమే త్రాగాలి ...ప్రొద్దున
గోరు వెచ్చని నీటిలో నిమ్మ కాయ రసం వేసుకుని త్రాగడం ఉత్తమం ...
15 . మజ్జిగ లో పుదీనా ఆకులు , మిరియాలు , శొంఠి పొడి వేసుకుని సాయంత్రం త్రాగడం వల్ల విటమిన్ బి 12 , కాల్షియమ్ , రిబోఫ్లావిన్ , ఫాస్ఫరస్ అందుతాయి ....

సూక్ష్మ పోషకాలు  కలిగి ఉన్న ఆహారం తినడం వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది ..

అనాస పండ్లు , సేపు , కివి , ఆకు కూరలు వీటిలో సూక్ష్మ పోషకాలు కలిగి ఉంటాయి ...

కొన్ని రకాల వంటకాలు :

1 . వేడి వేడి కిచిడి ( బియ్యం , పసుపు , పప్పులు , మిరియాలు , అల్లం , వెల్లి, ఉల్లి  తో తయారు చేసిన ) 
2 . ఇడ్లి , పొంగల్ , రాగి జావ, గోధుమ లేదా జొన్న జావ , ఓట్స్ ఉప్మా , కూరగాయలు వేసిన ఉప్మా ..
3 . చపాతీ , జొన్న , సజ్జ , గోధుమ చపాతీ ...
4 . వేడి వేడి సాంబార్ , పుదీనా చట్నీ , టమాటా చట్నీ , అల్లం చట్నీ ...
5 . ముడి బియ్యం అన్నం  లేదా ముడి బియ్యం తో చేసిన వంటలు ...

వేడి వేడి ఆహారాన్ని మాత్రమే తినాలి ...శరీరానికి పడని మరియు చల్లని ఆహారాన్ని తినకపోవడం మంచిది .....తేలికగా జీర్ణం అయ్యే ఆహారాన్ని తినాలి ...మధుమేహులు తగిన ఆహారాన్ని మాత్రమే తినాలి ...

16 . కరోనా బారినపడి కోలుకున్నాక అనవసరపు ప్రయాణాలు చేయరాదు ....
17 . పరిశుభ్రమయిన వాతావరణం లో ఉండాలి 

18. బయటికి వెళ్లాల్సి వస్తే మంచి నాణ్యత కలిగిన మాస్క్ ధరించాలి 
19. మన వెంట ఎల్లప్పుడూ శానిటైజర్ ఉంచుకుని అవసరమయినప్పుడు వాడుకోవడం వల్ల మళ్ళి కరోనా కు గురికాకుండా చూసుకోవచ్చు ...

20. క్రమం తప్పకుండ ఆరోగ్యాన్ని బట్టి వైద్యులను సంప్రదించండి 

21. శ్వాస  లో ఇబ్బంది గా  అనిపిస్తే  ఆక్సీజన్ లెవెల్స్ ని చెక్ చేయించుకోండి ..
22. మీ శరీరం లో జరిగే పరిణామాలను గమనించండి ఏదయినా తేడా అనిపిస్తే వైద్యున్ని సంప్రదించండి 


సర్వే జన: సుఖినోభవంతు:

మీకేదయినా ఆరోగ్య సలహా కోసం మమల్ని సంప్రదించండి Call / WhatsApp : 93 98601060

 

మీకు ఇంకా ఎలాంటి ఆరోగ్య సూత్రాలు అవసరమో ఇక్కడ కామెంట్ చేయండి ..అలాగే మీ ఈ సమాచారం మీద మీ విలువయిన అభిప్రాయాలు తెలియచేయండి 

Add new comment

Enter the characters shown in the image.
This question is for testing whether or not you are a human visitor and to prevent automated spam submissions.

Home