Published: 07-10-2024
Author : Team plus100years
బీట్రూట్ రసం కేవలం రిఫ్రెష్ పానీయం కంటే ఎక్కువ; ఇది మీ ఆరోగ్యాన్ని కాపాడే అద్భుత మయిన పానీయం దీంట్లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి .
మీరు మీ రోజువారీ ఆహారంలో ఆరోగ్యకరమైన మరియు శక్తివంతమైన పానీయాన్ని జోడించాలని చూస్తున్నట్లయితే, బీట్రూట్ జ్యూస్ మీకు ముందు వరసలో ఉంటుంది .
ఈ బ్లాగ్లో, బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, మీరు దానిని ఎలా తయారు చేసుకోవాలో అన్ని తెలుసుకుందాం ..
ఇంకా కొన్ని సులభమైన మరియు రుచికరమైన బీట్రూట్ జ్యూస్ వంటకాలను నేర్చుకుంటాము.
How To Prepare Beetroot Juice in Telugu ?
మొదటగా బీట్రూట్ జ్యూస్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి మరియు మీ రోజు ను ఆరోగ్యకరంగా మార్చుకోండి.
ఇప్పుడు మీరు రుచికరమైన బీట్రూట్ జ్యూస్ని తయారు చేయడం వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాము .
బీట్రూట్ జ్యూస్ తయారు చేసే విధానం :
1. తాజా బీట్రూట్లను ఎంచుకోండి
2. బీట్రూట్లను బాగా కడగాలి మరియు పై తొక్క ను తీసివేయాలి
3. చిన్న ముక్కలుగా కత్తిరించండి
4. అల్లం ని ముక్కలుగా చేసుకోండి మరియు నిమ్మకాయను సిద్ధం చేసుకోండి
5. బీట్రూట్ ముక్కలను , అల్లం ముక్కలను జ్యూసర్లో వేసి కొద్దిగా నీరు పోస్తూ గ్రైండ్ చేయాలి
6. గుజ్జును మొత్తం గ్లాస్ లో వడపోసిన తరువాత 2 పుదీనా ఆకులను వేసి త్రాగండి లేదా పుదినాను గ్రైండర్ లో అన్నిటి తో పాటు వేసి గ్రైండ్ చేసినా మంచిదే ..
మీ యొక్క రుచిని బట్టి కొద్దిగా రాతి ఉప్పును కానీ , లేదా ప్రాసెస్ చేయని పంచదార ని వేసుకోవచ్చు ..
మధుమేహులు చక్కర వాడక పోవటం మంచిది ..
ఇప్పుడు మీరు ఒక మంచి ఆరోగ్యకరమయిన పానీయాన్ని తయారు చేసారు ..దీన్ని మీ పిల్లలకు కుటుంబ సభ్యులకు ఇవ్వండి
ఇంకో రకమయిన బీట్రూట్ జ్యూస్
🍹 బీట్రూట్ ను ఆపిల్ , క్యారెట్ , అల్లం తో కలిపి కూడా జ్యూస్ చేసుకోవచ్చు ...
పిల్లలు ఇష్టపడాలంటే తేనె కానీ ఆరంజ్ ముక్కలతో కూడా బీట్రూట్ జ్యూస్ ని తయారుచేసుకోవచ్చు.
బీట్రూట్ జ్యూస్ అనేది పోషకాలు అధికంగా ఉండే పానీయం, ఇందులో వివిధ రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. బీట్రూట్ జ్యూస్లో ఉండే కొన్ని ముఖ్య పోషకాలు ఇక్కడ ఉన్నాయి:
⭐ విటమిన్ సి
⭐ ఫోలేట్
⭐ పొటాషియం
⭐ ఐరన్
⭐ మాంగనీస్
⭐ మెగ్నీషియం
⭐ నైట్రేట్
⭐ ఫైబర్
⭐ ఎలెక్ట్రోలైట్స్
ఇంకా ఎన్నో ఉన్నాయి ..
బీట్రూట్ జ్యూస్ ను ఎందుకు త్రాగాలి
👉 రక్తహీనతను నివారించడానికి
👉 గుండె ఆరోగ్యం కోసం
👉 అధిక రక్తపోటు అదుపు కోసం
👉 కండరాలకు ఆక్సిజన్ పంపిణీని మెరుగుపరుస్తుంది
👉 అధిక బరువు సమస్యకు
👉 రోగ నిరోధక శక్తి మెరుగుదల కు .
👉 జీర్ణక్రియ పనితీరు మెరుగు కోసం
👉 చర్మం మరియు వెంట్రుకల ఆరోగ్యం కోసం
ఇది సమాచారం కోసం మాత్రమే : ఇక్కడ ఇచ్చిన సమాచారం వివిధ ఇంటర్నెట్ సోర్సెస్ నుండి తీసుకోబడ్డది , అధిక సమాచారం కోసం మీ యొక్క ఎక్స్పర్ట్ ను సంప్రదించండి ..
Add new comment